Sunday 8 September 2013


మురళీ గీతం మెచ్చిన రోజు.. 9 September' 13

ఆత్మనూన్యతను దాటి....
అరవ రాజ్యంలో..
ఆర్ధిక శాస్త్రాన్ని...
అధ్యాయనం చేస్తున్న...
అయిటిపాముల అమ్మాయికి....

నిద్రను దాటి..
నిబద్ధతతో...
నిన్ను నువ్వు కొత్తగా చూపుకున్న,,
"సింధూ"ర పువ్వుకు..

కొటాలను దాటి..
కొఠి  ఉమెన్స్ కాలేజి ని దాటి..
కొరుకున్న కొర్సులొ చేరిన...
కరుణించె మనసున్న నవ్వుకి...

ఫుట్టిన రోజు శుభాకాంక్షలు...

ప్రేమతొ..
ఫిల్లలమర్రి కుటుంబం...  
      

Saturday 23 February 2013

నా నేను...

నేనెంత కర్కక్షుణ్ని....
నా రక్తాన్ని నేనే
కన్నీటి మడుగులొ పూడ్చేసాను
నిర్ధయగా......

నా మరో రూపాన్ని
నామ రూపాలు లేకుండా దాచెసాను
కౄరంగా......

నిమిషపు స్థితిలో
నా లొని నాకు 
"నిర్యాణం".... 

నది ఒడ్డున 
నాకు నెనే నిశ్శబ్దంగా....

"కన్న" కల
కన్నీరు ను ఇచ్చింది...

మరోసారి నానమ్మ 
నన్ను చూడకుండానే వెళ్ళింది...
ఈసారి జీవితకాలపు 
శిక్ష విధిస్తూ....

నా పైన ఇంకా కోపాన్ని కొనసాగిస్తూ...  

Friday 5 October 2012

నానమ్మ కోడలి పాకం...



పిన్ని వంట..
అమృతపు పంట...
ఆమే కరములు ....
నలభీముని వరములు....

నీ కోసం.....


అమ్మ ఆత్మీయతను
నీ స్పర్శలొనే అనుభవించాను....

ఆలోచనల తుంపరలను
నీ ఒడిలోనే రూపానిచ్చాను.....

చీకటి భయాన్ని
నీ వేలు పట్టుకొనే ఎదిరించాను....

అమృతపు ఆహారాన్ని
నీ చేతితోనే ఆస్వాదించాను......

అర్థపు అల్లర్లను
నీ పోపు డబ్బాలతోనే ఆపేసాను....

కొంగు ముడిలో దాచి తెచ్చిన గుగ్గిళ్ళు.....
నా జీవితకాలపు ఆనంద గుళికలు.....

నువ్వు మమ్మల్ని వీడిన క్షణం నుండి...
మా చుట్టు అనాథ అడుగుల చప్పుడు.....


మా తప్పు దిద్దుకునే అవకాశం ఇవ్వు....
నీ ప్రేమకొసం, నీ చల్లన్ని చూపుకొసం, ఇంకా
నీ కన్నుల కరుణ కోసం....

నన్ను కన్న నాన్న అమ్మ....
నా నానమ్మ....

మళ్ళీ రావా........

వికతమవుతున్న మొక్కకు....
మనసెరిగిన జలప్రాణమై రావా...

Monday 1 October 2012

మా "జ్ఞానా" నికి......


సంపద "ములకల" పాదు దాటి
మనసు "మర్రి" పూల తోటలొ
"కవల కలువ నవ్వులతో
"భావ భావికతా"సుగంధాన్ని నింపిన
మా చిన్ని "పిన్ని" కి...


ఆటు పొటులను సైతం
ఆత్మీయతతో అధిగమించి
ఆసరాగ నిలిచిన
అలుపెరుగని "చిరునవ్వుకి".......

విశాక తీరంలొ రఘునందనుడికి
ఆనంద "జ్ఞానా"నిచ్చిన
"ఈశ్వరి" కి.......


పుట్టిన రోజు శుభాకాంక్షలు........


ప్రేమతో........
మీ పిల్లలమర్రి పిల్లలు.....